143 - ఎందుకనీ..కనీ... ఏమిటనీ...టనీ

మ్యూజిక్: చక్రి
స్టారింగ్: సాయిరాం శంకర్, సమీక్షా
మూవీ: 143





ఎందుకనీ..కనీ... ఏమిటనీ...టనీ
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్య గగనంలా
ఎందుకనీ.... ఏమిటనీ....


నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిలా
ఒంటరి తనమై క్షణమొక యుగమై మిగిలే ఏమిటలా
ఆరిన పెదవుల మాటలికా...నా మాటలికా.. నామాటలికా...
చెర్రున చెలి నీదాకా...దాకా....దాకా...దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం వున్నది నీకోసం
నా కనులలో నిన్నటి నీరూపం
ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ....


వెలుగులే చిలికే చిరు జాబిలి మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరునగవులపై చీడే చేరెనెలా
చిలిపిగా చేసిన బాసలిలా... ఆ బాసలిలా... ఆ బాసలిలా...
నా మదినె తొలిచేనా...తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై
నీ చెక్కిలితాకన చిరు ఆశై ||ఎందుకనీ||

Post a Comment

0 Comments