7G Brundhavana Colony - కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే

కాస్ట్: రవి కృష్ణ, సోనియా అగర్వాల్
డైరెక్టర్: శ్రీ రాఘవన్
మ్యూజిక్: యువాన్ శంకర్ రాజా
లిరిక్స్: శివ గణేష్ & AM  రత్నం

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
ఇవి అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే
ఒకపరి మగున చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే

హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే
కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగూ దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ మిణిగురు పురుగుకు తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమటా

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

లోకాన పడుచులు ఎందరున్ననూ మనసు ఒకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణం తోనే ఆటాడులే
మంచుబిందువొచ్చీ ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే
నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసే వచ్చులే
ఒకపరి మగున చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే

కన్నుల బాసలు
హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే

Post a Comment

0 Comments