లిరిక్స్: రామ జోగయ్య శాస్త్రి
సింగర్: కాల భైరవ
మ్యూజిక్: స్ థమన్
ఆర్టిస్ట్స్: JR JTR, పూజ హెగ్డే
నిద్దర్నీ ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువోచ్ఛే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గుర్తొఛ్చి రారా
గలబోటి కూరొంది పిలిసినా రారా
పెనిమిటీ ఎన్నినాళ్ళయి నాదో
నిను జూసి కళ్లారా
ఎన్నెన్ని నాళ్ళయినాదో
నిను జూసి కళ్లారా
చిమ్మాటి సీకటి కమ్మటి సంగతి
ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి ||2x||
గుండెనే గొంతు సేసి పాడతాంది రారా పెనిమిటీ ||2x||
హే...
చిమ్మాటి సీకటి కమ్మటి సంగతి
ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి ||2x||
గుండెనే గొంతు సేసి పాడతాంది రారా పెనిమిటీ ||2x||
పొలిమేర దాటి పోయావని...
పొలమారిపోయే నీదానీనీ...
కొడవలి లాంటి నిన్ను సంటి వాడని
కొంగున దాసుకునే ఆళి మనసుని
సూసి సూడక సులకన్నా సేయకు..
నాతల రాతలో కలతలు రాయాకు
తాళిబొట్టు తలుసుకొని
తరలి తరలి రారా పెనిమిటీ...
హే....
తాళిబొట్టు తలుసుకొని
తరలి తరలి రారా పెనిమిటీ...
నరగోస తాకే... కామందువే ||2x||
నలపూసవై నా కంటికందవే
కాటికి ఎండలలో కందిపోతివో
రాగతపు సింధులతో తడిసిపోతివో
ఏలకు తింటివో ఎట్టానువ్వుంటీవో
యేట కట్టి తలగడై ఎడా పడుకుంటివో
నువుకన్నా నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటీ ||2x||
నిద్దర్నీ ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువోచ్ఛే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
పెనిమిటీ ఎన్నినాళ్ళయి నాదో
నిను జూసి కళ్లారా
ఎన్నెన్ని నాళ్ళయినాదో
నిను జూసి కళ్లారా
0 Comments