సాంగ్: నిన్నిలా నిన్నిలా
మూవీ: తొలిప్రేమ (2018)
మ్యూజిక్ డైరెక్టర్: SS థమన్
సింగర్: అర్మాన్ మాలిక్, SS థమన్
లిరిసిస్ట్: శ్రీమణి
నిన్నిలా నిన్నిలా చూసానే
కళ్ళలో కళ్ళలో దాచనే
రెప్పలా వెయ్యనంతగా
కనుల పండగే
నిన్నిలా నిన్నిలా చూసానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినపడిందిగా
ప్రేమ చప్పుడే
నిన్ను చేరి పోయి నా ప్రాణం
కోరేనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం నాలో ఆనందం
నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం
ఈ వర్షానికి స్పర్శఉంటే
నీ మనసే తాకెనుగా
ఈ యదలో నీ పేరే
పలికేలా ఇవాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శఉంటే
నీ మనసే తాకెనుగా
ఈ యదలో నీ పేరే
పలికేలా ఇవాళే ఇలా
తొలి తొలి ప్రేమే దాచే కళా
చిరు చిరు నవ్వే ఆపేయ్ కిలా
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతగా
నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా
ఈ వర్షానికి స్పర్శఉంటే
నీ మనసే తాకెనుగా
ఈ యదలో నీ పేరే
పలికేలా ఇవాళే ఇలా
తొలి తొలి ప్రేమే దాచే కళా
చిరు చిరు నవ్వే ఆపేయ్ కిలా
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతగా
0 Comments