మ్యూజిక్: కీరవాణి
లిరిక్స్: K శివదత్త, Dr.K.రామ కృష్ణ
సింగర్: కైలాష్ ఖేర్
ఘనకీర్తిసాంద్ర విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్ర మణిదీపకా..
ఘనకీర్తిసాంద్ర విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్ర మణిదీపకా
త్రిశతకాధికా చిత్రమాలికా
జైత్రయాత్రికా కథానాయకా...
ఘనకీర్తిసాంద్ర విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్ర మణిదీపకా
త్రిశతకాధికా చిత్రమాలికా
జైత్రయాత్రికా.. కథానాయకా..
🎶 మ్యూజిక్ 🎶
ఆహార్యాంగిక వాచిక పూర్వక
అద్భుత అతులిత నటనా ఘటికా..
భీమసేన వీరార్జున కృష్ణ దానకర్ణ మానధన సుయోధన
భీష్మ బృహన్నల విశ్వమిత్ర లంకేశ్వర దశకంటారావణాసురాధి
పురాణ పురుష భూమిక పోషకా..
సాక్షాత్ సాక్షాత్కారకా..
త్వదీయ ఛాయాచిత్రచ్చాదిత
రజిత రంజిత చిత్రయవనికా..
న ఇదం పూర్వక రసోత్పదక..
కీర్తికన్యకా మనోనాయకా...
కథానాయక.. కథానాయక..
జయహో .. జయహో .. ||3x||
0 Comments