Song: Chitti
Movie: Jathi Ratnalu
Singer: Ram Miriyala
Music Director: Radhan
Lyricist: Ramajogayya Sastry
చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే
అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే
వచ్చేశావే లైనులోకి వచ్చేశావే
చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావే
హత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ, నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే
యుద్ధమేమి జరగలే సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చజెండ చూపించినావే
మేడం ఎలిజబెత్తు నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే
తీన్ మార్ చిన్నోడిని డీజే స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బ్యాడు ఉన్నోన్ని నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే
అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చిబజ్జి లాంటి లైఫుల నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గిచ్చేసావే లవ్వు టాటూ గుచ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో నింబూ చెక్కై హల్చల్ చేశావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ, నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే
5 Comments
Super
ReplyDeletehttps://evergreentelugulyrics.blogspot.com/
Deletesuper site Evergreen Telugu Lyrics
ReplyDeleteThanks for this fantastic Oorantha vennela song lyrics in telugu
ReplyDeleteNice RRR Movie Download
ReplyDelete