Yeda Poyinaado lyrics from Aravindha Sametha (2018)

సాంగ్: ఏడ బోయినాడో
సింగర్: నికిత శ్రీవల్లి, కైలాష్ ఖేర్, పెంచల్ దాస్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ, పెంచల్ దాస్
మ్యూజిక్: SS. థమన్
స్టార్రిన్గ్ : Jr. NTR, పూజ హెగ్డే



ఏ కోనలో కూలినాడో
ఏ కొమ్మలో చేరినాడో
ఏ ఊరికో ఏ వాడికో
యాడ బొయ్యాడో



రం రుధిరం సమరం శిశిరం
రం మరణం గెలవం ఎవరం

ఏడ బోయినాడో ఏడ బోయినాడో
వింత లేని లోకం సూడబోయినాడో
చారడేసి గరుడ పచ్చ కళ్ళు వాల్చి గరిక పచ్చ నేలపైనే
సీమ కచ్చ వేటు వేస్తే రాలి పోయినాడో



రం రుధిరం సమరం శిశిరం
రం మరణం గెలవం ఎవరం

కట్టెలే సుట్టాను కాడు మన తల్లి తండ్రి  
అగ్ని దేవుడే మనకు ఆత్మ బంధువుదంట
కాలవ గట్టున నీ కాళ్ళు కాలంగ
కాకి శోకము బోతిమే కాకి శోకము బోతిమే 

నరక స్వర్గ అవధి దాటి వెన్నమాకులు దాటీ
విదియందు రారా  అని తదియందు రారా అని 
నట్టింట ఇస్తర్లు నాణ్యముగా పరిపించి 
నీ వారు చింత పొయ్యేరు  నీ వారు దుఃఖ పొయ్యేరు 

మృత్యువు మూకుడు మూసినా ఊళ్లకు రెక్కలు తొడిగేదెవరని
ఇంకని చెంపల పారే సోకం తూకం వేసేదెవరని
కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు ఎక్కడని
ఊపిరాడని గుండెకు గాలిని కబళం ఇచ్చేదెవరని

చుక్కేలేని నింగి ప్రశ్నించిందా వంగి
ఏకోనల్లో కూలినాడో ఏకొమ్మలో చేరినాడో


రం రుధిరం సమరం శిశిరం
రం మరణం గెలవం ఎవరం

హరోంహరి... నీ కుమారాలిచ్చిన భక్చభోజనములు రాగికానులు
ఇరం విడిచి పరం జేరిన
వారి పెద్దలకు పేరంటాలకు మోక్షాధి ఫలము కల్గు
శుభోజ్యము..
పద్నాల్గు తరాలు వారికి మోక్షాధి ఫలము కలుగును
శుభోజ్యము..
శుభోజ్యము...











Post a Comment

0 Comments